ఫజ్లుల్లా బతికే ఉన్నాడు: పాకిస్థాన్ తాలిబాన్

పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని సమస్యాత్మక స్వాత్ లోయలో తీవ్రవాదులకు నేతృత్వం వహిస్తున్న తాలిబాన్ కమాండర్ ఫజ్లుల్లా బతికే ఉన్నాడని, అతనికి ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని గురువారం తాలిబాన్ ప్రతినిధులు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం సైన్యం జరిపిన దాడిలో ఫజ్లుల్లా గాయపడ్డారని పాక్ మిలిటరీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే తాలిబాన్ల తాజా ప్రకటన మాత్రం మిలిటరీ కథనానికి భిన్నంగా ఉంది. ఈ నెల ప్రారంభంలో మిలిటరీ ఫజ్లుల్లా సైనికుల దాడిలో గాయపడినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాలిబాన్ ప్రతినిధి ముస్లిం ఖాన్ గురువారం మాట్లాడుతూ.. ఫజ్లుల్లా బాగానే ఉన్నాడని, గాయపడలేదని, తాలిబాన్ల నాయకత్వం కూడా బాగానే ఉందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి