బర్మాలో అధికారంలో ఉన్న మిలిటరీ జుంతా రాజకీయ ఖైదీలను విడిచిపెట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ డిమాండ్ చేశారు. మయన్మార్లో అధికారంలో ఉన్న మిలిటరీ పాలకులు ప్రతిపక్ష ప్రజాస్వామ్య యోధురాలు అంగ్ సాన్ సూకీతోపాటు, పలువురు నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే.
ఏళ్ల తరబడి రాజకీయ ఖైదీలుగా కాలం వెల్లదీస్తున్న మయన్మార్ నేతలను విడిచిపెట్టాలని బాన్ కీ మూన్ మిలిటరీ జుంతాను కోరారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సూకీ గత 19 ఏళ్లలో 14 ఏళ్లపాటు గృహ నిర్బంధంలో ఉండటం గమనార్హం. ఐరాసలోని మయన్మార్ శాశ్విత ప్రతినిధిని బాన్ కీ మూన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా బాన్ మయన్మార్ రాజకీయ ఖైదీల విడుదలకు డిమాండ్ చేసినట్లు ఆయన ప్రతినిధి ఒకరు వెల్లడించారు.