వేలానికి హిట్లర్ సంతకాలతో కూడిన పెయింటింగ్స్

FILE
నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ సంతకాలతోకూడుకున్న మూడు పెయింటింగ్స్‌‌ను దక్షిణ జర్మనీలోనున్న న్యూరెంబర్గ్‌లో వచ్చే నెలలో వేలం వేయనున్నారు.

స్థానిక పత్రిక తెలిపిన వివరాల మేరకు ఈ చిత్రాలను 1910-1911 సంవత్సరాల మధ్య చిత్రీకరించినవి. " వీడలర్ ఆక్షన్ హౌస్ " వీటిని వేలం వేసేందుకు సిద్ధమౌతోందని ఆ పత్రిక తెలిపింది.

ఈ పెయింటింగ్స్‌‌ వేలం ప్రారంభపు ధర 4270 అమెరికా డాలర్లుగా నిర్ణయించినట్లు " వీడలర్ ఆక్షన్ హౌస్ " తెలిపింది. వీటిని సెప్టెంబర్ నెల 5వ తేదీన వేలం వేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

గడచిన ఏప్రిల్ నెలలోనూ హిట్లర్‌కు చెందిన సంతకాలతో కూడిన రెండు పెయింటింగ్స్‌‌ను వేలం వేసింది. అప్పుడు ఈ పెయింటింగ్స్‌‌ 45,550 అమెరికా డాలర్లకు పలికినట్లు ఆ సంస్థ పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి