సమీప భవిష్యత్‌లో ఒబామా భారత పర్యటన

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమీప భవిష్యత్‌లో భారత పర్యటనకు విచ్చేస్తారని వైట్‌హోస్ తెలిపింది. అయితే వచ్చే మూడు నెలల్లో మాత్రం ఆయన భారత్ పర్యటనకురారని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటనకు ఎప్పుడైన వెళ్లవచ్చని వైట్‌హోస్ మీడియా కార్యదర్శి రాబర్ట్ గిబ్స్ తెలిపారు.

అయితే వచ్చే మూడు నెలల కాలానికి సంబంధించిన ఖరారైన షెడ్యూల్‌లో మాత్రం ఆయన భారత పర్యటన లేదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఇదిలా ఉంటే భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ ఏడాది నవంబరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.

వెబ్దునియా పై చదవండి