సుప్రీం తీర్పుపై స్పందించేందుకు ముషారఫ్ నో

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై స్పందించేందుకు నిరాకరించారు. నవంబరు 3, 2007న దేశంలో ఎమర్జెన్సీ విధించడంతోపాటు, ఆయన తీసుకున్న ఇతర నిర్ణయాలు రాజ్యాంగబద్ధం కాదని, అక్రమమని పాకిస్థాన్ సుప్రీంకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పు వెలువరిచిన సంగతి తెలిసిందే.

ముషారఫ్ చర్యలు న్యాయసమ్మతం కాదని, రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించేందుకు ముషారఫ్ నిరాకరించినట్లు పాకిస్థాన్‌కు చెందిన డైలీ టైమ్స్ వార్తాపత్రిక పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఇటలీలో ఉన్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి సారాంశాన్ని చూసిన అనంతరం దీనిపై స్పందిస్తానని ముషారఫ్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి