ఇటలీ ప్రధాని సిల్వియో బర్లుస్కోనీ మరియు ఓ వేశ్య మధ్య జరిగిన అశ్లీల సంభాషణకు చెందిన ఓ టేపును ఆ దేశానికి చెందిన ఓ వారపత్రిక మార్కెట్లోకి విడుదల చేసింది.
సిల్వియో బర్లుస్కోనీ మరియు ఓ వేశ్య మధ్య జరిగిన అశ్లీల సంభాషణకు సంబంధించిన సంభాషణను ఓ వార్తా పత్రిక రికార్డు చేయడం జరిగింది. వారి సంభాషణను రికార్డు చేసిన తొలి భాగాన్ని మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత ప్రతిపక్షాలు తీవ్ర దుమారాన్ని లేపాయి.
ఈ టేపుకు సంబంధించిన మహిళ పెట్రిజియో దఆదారియో మాట్లాడుతూ... రోమ్లోనున్న ప్రధానమంత్రి నివాసంలో తాను ఓ రోజు రాత్రిపూట భోజనానికి వెళ్ళానని ఆ తర్వాత నవంబర్ నాలుగున ఓ రాత్రి తను ప్రధానితో గడిపినట్లు ఆమె తెలిపారు.
ఇదిలావుండగా తాజాగా వెలువడిన టేపులో ఆమె ఓ పురుషునితో సెక్స్‌కు సంబంధించిన సంభాషణను కొనసాగించినట్లు సమచారం. ఆ పురుషుని గొంతు ప్రధాని బర్లుస్కోనీదేనని ఆ పత్రిక వెల్లడించింది. ఆ టేపులో సంభాషించిన మహిళ పురుషుని సెక్స్ ప్రతిభను మెచ్చుకుంటున్నట్లు వారి సంభాషణ కొనసాగిందని ఆ వార పత్రిక వెల్లడించింది.
ఇదిలావుండగా దాఆదారియో ప్రధానమంత్రితో సెక్స్ విషయంపై సంభాషించిన మాటలను తనే రికార్డ్ చేసినట్లు తెలిపింది. తాను చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన సమస్యలను ఆయన పరిష్కరిస్తానంటేనే తాను అతనితో శృంగార కార్యకలాపాలను కొనసాగించినట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను అతని సంభాషణలను రికార్డు చేసినట్లు ఆమె తెలిపింది.
కాగా రికార్డ్ చేసిన టేప్‌లో ప్రధానమంత్రి గొంతును ఎవరో అనుకరించి మాట్లాడి రికార్డు చేసి ఉంటారనేది అనుమానంగా ఉందని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. కాని దీనిపై ఇంకా ఏ విషయం స్పష్టం కాలేదని ఉన్నతాధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రతిపక్షాలు మాత్రం ఆ గొంతు ప్రధానిదేనని ఘంటాపథంగా చెపుతున్నాయి. గతంలోకూడా బర్లుస్కోనీ లెస్బియన్లను ఓ పార్టీకి ఆహ్వానించి వివాదాలలోకి చిక్కుకున్న విషయాన్ని ప్రతిపక్షాలు ఈ సందర్భంగా గుర్తు చేశాయి.