స్విస్ బ్యాంక్లో భారత ప్రముఖులకు సంబంధించిన అకౌంట్ల వివరాలను అందివ్వలేమని స్విస్ బ్యాంకర్ అసోసియేషన్ ప్రతినిధి స్పష్టం చేశారు. స్విస్ బ్యాంకులో భారత ప్రముఖులు తమకు చెందిన నల్లధనాన్ని స్విస్ బ్యాంకులో దాచుకున్న విషయం తెల్సిందే.
ఈ బ్యాంకు అకౌంట్ల వివహాలను తెలుసుకుని నల్లధనాన్ని స్వదేశానికి తీసుకుని వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఈ వివరాలను ఇచ్చేందుకు తొలుత సానుకూలంగా అంగీకరించిన స్విస్ బ్యాంకు అధికారులు ప్రస్తుతం ఇచ్చేందుకు నిరాకరించారు.