నేను స్టార్ హీరోను కాను.. ముగ్గురు మావయ్యలు లేకుంటే మేము లేం : సాయి ధరమ్ తేజ్
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (15:48 IST)
ఈ ఏడాది చిరంజీవి తర్వాత మెగా కుటుంబం నుంచి సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ 'విన్నర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మొదటి నుండి మంచి క్రేజ్‌ను బిల్డప్ చేసుకుంటూ వచ్చిన ఈ చిత్రంతో తేజ్ తన కెరీర్లోనే ఉత్తమమైన ఓపెనింగ్స్ సాధించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేజ్ మాట్లాడారు.
* విడుదల తర్వాత ఎలాంటి రిపోర్ట్స్ వచ్చాయి?
సినిమాకి ప్రేక్షకుల రెస్పాన్స్ బాగుంది. కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఓపెనింగ్స్ కూడా చాలా బాగున్నాయి. రోజు రోజుకి స్పందన పెరుగుతుడటం నాకు, నా నిర్మాతలకు చాలా సంతోషం కలిగిస్తోంది.
* చిత్రాన్ని ఏ ప్రాతిపదకన అంగీకరించారు?
కథను బట్టే చేయాలనిపించింది. బ్యాక్‌డ్రాప్ కొత్తగా వుంది. తండ్రీ కొడుకుల అనుబంధం ఆకట్టుకుంది.
* మీ నాన్నగారు సినిమా చూశారా?
ఇంకా చూడలేదు. చూస్తారు.
* హీరో ఇంట్రడక్షన్ చేస్తున్నప్పుడు చాలా చిత్రాలు వచ్చాయనే ఫీలింగ్ కలగలేదా?
కమర్షియల్ సినిమా కనుక.. విలన్స్‌ను బుద్ధిచెప్పేటప్పుడు హీరో ఎంటర్ కావాలి. తను ఎలా వచ్చాడనేదికంటే.. ప్రేక్షకుడికి వినూత్నంగా అనిపించాలి. అదే నాకు నచ్చింది.
* బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిందని అంటున్నారు ఎలా వుంది?
నేను ఈ కలెక్షన్ల లెక్కల్ని, నెంబర్ గేమ్‌ని పెద్దగా పట్టించుకోను, నేను చేయగలిగిందంతా చేశాను. నా నిర్మాతలకు పెట్టిన డబ్బు తిరిగొచ్చేస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది.
* నిర్మాతలు మీ మీద ఎక్కువ డబ్బు పెట్టారని మీకనిపించిందా?
నేనేమీ స్టార్ హీరోని కాదు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా. నిర్మాతలు డబ్బు పెట్టింది నా మీద కాదు. మంచి స్టోరీ లైన్ మీద. సబ్జెక్ట్ హెవీగా ఉంది. దాన్ని గొప్పగా తీయాలంటే డబ్బు కాస్త ఎక్కువే పెట్టాలి. రిచ్ విజువల్స్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. ప్రతి ఒక్కరు వాటి గురించే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అస్సలు ఫీలవడం లేదు.
* మీ అమ్మగారి రియాక్షన్ ఏంటి?
అమ్మ చాలా సంతోషించారు. మా సోదరుడు, ఫ్రెండ్, నటుడు నవీన్ నా బెస్ట్ క్రిటిక్స్. వాళ్లందరికీ సినిమా నచ్చింది. ముఖ్యంగా జగపతిబాబుతో ఉండే సన్నివేశాలు చాలా బాగున్నాయంటున్నారు.
* జగపతిబాబుతో పని చేయడం ఎలా ఉంది?
ఇండస్ట్రీలో ఉన్న ఉత్తమమైన నటుల్లో జగపతిబాబు కూడా ఒకరు. నెను రీటేక్స్ తీసుకునేప్పుడు చాలా ఓపిగ్గా ఉండేవారు. ఆయన సపోర్ట్ నాకే మరీ ఎక్కువగా ఉందనిపించింది.
అవన్నీ దర్శకుడి ఆలోచనలే. ఆయన చెప్పినట్టే చేశాను. ఒకసారి సెట్లోకి అడుగుపెట్టాక పూర్తిగా దర్శకుల హీరోగా మారిపోతాను. వాళ్ళు ఏది చెబితే అది చేసేస్తాను.
* గుర్రపు స్వారీ చిన్నతనంలోనే నేర్చుకున్నారా?
చిన్నతనంలో నేర్చుకోవాలనిపించలేదు. చరణ్.. వెళుతుంటే చూసేవాడిని.. సినిమాకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. శిక్షకుని సంరక్షణలో గుర్రాల ప్రవర్తన ఎలా వుంటుంది. దానికి తగినట్లు మనల్ని మనం ఎలా మలుచుకోవాలనేది కొన్ని టిప్స్ తెలుసుకున్నా. క్లెమాక్స్‌లో నాలుగుసార్లు కింద పడ్డాను కూడా. అప్పుడు అమ్మ గుర్తుకువచ్చింది.
* స్టైలిష్ లుక్ వెనుక సీక్రెట్ ఏంటి?
అంతా ప్లాన్ ప్రకారమే చేశాం. ఒక న్యూస్ పేపర్ క్రియేటివ్ హెడ్ కాబట్టి అలా స్టైలిష్ లుక్ ట్రై చేశాం. నా లుక్ అంత స్టైలిష్‌గా ఉండటానికి నా టీమే కారణం. క్రెడిట్ అంతా వాళ్లదే.
* బాడీకోసం ప్రత్యేక డైట్ అవలంభించారా?
బాడీని పెంచేటప్పుడు కోచ్ చెప్పినట్లు.. బాయిల్ ఎగ్స్, ప్రై చికిన్ తినాల్సివస్తుంది. ఇవి తిన్నాక.. వారానికి ఒకసారి అమ్మచేతి వంట అన్నం, ఆవకాయపచ్చడి, అప్పడాలు తింటుంటే ఆ రుచే వేరు.. అమృతంలా అనిపిస్తుంది.
* అమ్మ వడ్డిస్తూ.. మీ పెళ్ళి విషయం ప్రస్తావించలేదా?
చాలాసార్లు అడిగింది. ఇంతకు ముందు సంపాదనలేదు. ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నా.. మొన్నటివరకు స్కూల్ కాలేజీ.. మీరు చెప్పినట్లు విన్నా.. ఇప్పుడు కనీసం నాకు కొంచెం ఫ్రీ ఇవ్వడని అడిగాను. రేపు ఎలాగూ పెళ్ళయితే ఆమె మాట వినాలిగదా. మనకు దొరికే ఫ్రీడం ఈ కొద్దికాలమే. అందుకే నాలుగేళ్ళ తర్వాత మేరేజ్ గురించి మాట్లాడమని చెప్పాను.
* 'ఖైదీ నంబర్ 150' సినిమా చూశారా?
చిత్రం చూడటమే కాదు... చూసి.. గంతులేయడం కూడా జరిగింది. అమ్మడు.. కుమ్ముడు.... పాటకు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళి తెగ డాన్స్ వేసేశా.
వాళ్లనుంచి చాలా నేర్చుకున్నా. మనం మాట్లాడేది చాలా స్పష్టంగా సింపుల్‌గా నిదానంగా వుండాలి. ఇదివరకు స్పీడ్‌గా మాట్లాడేవాడిని. ఎదుటివారికి పెద్దగా అర్థమయ్యేదికాదు. ఇక చిరంజీవి మామయ్య నాకు దేవుడితో సమానం. ముగ్గురు మావయ్యలు లేకుంటే నేను, అమ్మ, తమ్ముడు లేము.
* మీ ఫ్రెండ్స్‌తో ఎలా వుంటారు?
నా బెస్ట్‌ఫ్రెండ్ నవీన్.. సీనియర్ నరేష్ అబ్బాయి. చెన్నైలో వుండగా.. ఇద్దరూ నిక్కర్ల నుంచి ఫ్రెండ్స్. ఫెయిల్యూర్స్ సక్సెస్‌ల్ని అతనిలో పంచుకుంటాను. నాకు మోరల్ సపోర్ట్ ఇస్తాడు.
* వీరు కాకుండా ఇంకా ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌వున్నారా?
మా ఫ్యామిలీలోనే ఉన్నారు. బయటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇక రకుల్, రాశీఖన్నా.. వారంతా కలిసి ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. చాలా సరదాగా వుంటాం.