తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో-చైర్మన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో రాణ్ చరణ్ సతీమణి ఉపాసనను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ చైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను, కో-చైర్మన్‌గా ఉపాసనను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఉపాసన స్పందిస్తూ, సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్‌కు చెప్పారు. సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాలచారి, క్రీడలు, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌కు ధన్యవాదాలు తెలిపారు. క్రీడా రంగంలో రాష్ట్ర అభివృద్ధి చెందడం కోసం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025ని తీసుకొచ్చింది. ఇందులోభాగంగా, స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణాను రూపొందించింది.