పంది మాంసం కాల్చుకుని తింటే ఆ రుచేవేరబ్బా : రష్మిక మందన్నా

బుధవారం, 25 నవంబరు 2020 (10:59 IST)
కన్నడసీమ నుంచి తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ రష్మిక మందన్నా (RashmikaMandanna). ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. అయితే, ఈ అమ్మడు తీసుకునే ఆహార పదార్థాల గురించి తాజాగా వ్యాఖ్యానించింది. 
 
టాలీవుడ్ హీరో రాం చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న (Upasana) "యుఆర్ లైఫ్" (URLife) అనే వెబ్ సైట్ ద్వారా ప్రజలకు ఆరోగ్యం గురించి అవగాహణ కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్లను తీసుకొచ్చి ఆరోగ్యకరమైన వంట‌లు వండిస్తోంది. ఈ కార్యక్రమం కోసం తాజాగా రష్మిక మందన్నాతో వంటలు చేయించింది. 
 
ఈ సందర్భంగా ఆమెతో రష్మిక మాట్లాడుతూ తన ఆహార అలవాట్లను గురించి చెప్పింది. ‘కోలీ పుట్టు’ అనే కూరను ర‌ష్మిక వండింది. దీంతో ఆమెను ఉపాస‌న ప్రశంసిస్తూ పలు ప్రశ్నలు అడిగింది. మీరు కోర్గి సామాజిక వర్గానికి చెందినవారా? అని, పంది మాంసం అధికంగా తింటారు కదా? అని ప్రశ్నలు వేసింది.
 
దీనికి ఆమె సమాధానమిస్తూ, అవునని చెప్పింది. తాము ఇంట్లోనే వైన్ తయారు చేసుకుంటామని, అలాగే పంది మాంసం తింటామని, ఆ మాంసాన్ని కాల్చుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుందని చెప్పింది. పంది మాంసం, వైన్‌తో రకరకాల వంట‌లు చేసుకుంటామ‌ని తెలిపింది. ఇకపోతే, నిద్ర పోయే ముందుకు రెండు క‌ప్పుల వైన్ తాగితే  హాయిగా నిద్ర ప‌డుతుంద‌ని చెప్పుకొచ్చింది. అంటే, రష్మిక మందన్నా బ్యూటీ సీక్రెట్ ఇదేనన్నమాట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు