ఎలా ఉండాలో చెప్పారు, కథల పరంగా సలహాలు అడగమని చెప్పారుః శ్రీవిష్ణు
బుధవారం, 18 ఆగస్టు 2021 (16:43 IST)
Srivishnu
హీరో శ్రీవిష్ణు నూతన సినిమా రాజ రాజ చోర. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్. హిసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణుతో ఇంటర్వ్యూ విశేషాలు.
- నేను వెంకటేశ్‌గారికి పెద్ద అభిమానిని. నా సినిమాను ఆయన సినిమాతో కంపేర్ చేయకూడదు. అయితే సినిమా చూస్తున్నంతసేపు కుటుంబంతో కలిసి చూసేలా ఉంటుందనిపించడం, హ్యుమర్, ఎమోషన్స్ ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అలా మాట్లాడాను.
- వెంకటేశ్‌గారిని కలిశాను కూడా. సినిమా చేయడానికి ముందు కూడా ఆయన్ని కలిసి కథ చెప్పాను. ఆయన బావుందని ఎంకరేజ్ చేశారు. ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఆయన తొలిసారి స్పందించారు. కామెడీ టైమింగ్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని మెచ్చుకున్నారు. అప్పుడు పాండమిక్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆయన్ని కలవలేదు. ఇప్పటికీ కుదిరింది. ఆయన్ని కలిసి మాట్లాడిన తర్వాత సినిమా చాలా బావుంటుందిలే అని ఎంకరేజ్ చేశారు.
- నాకు ఇంతకు ముందు వెంకటేశ్‌గారిని కలిసే అవకాశం వచ్చినప్పటికీ నా అంతట నేను నా హీరో దగ్గరికి వెళ్లకూడదు. ఆయనే పిలవాలని ఓ చిన్న టార్గెట్ పెట్టుకున్నాను. పలానా సినిమాలో బాగా చేశావని ఆయన పిలిచి మాట్లాడితే బావుంటుంది కదా..అని ఎదురుచూశాను. నీది నాది ఒకే కథ తర్వాత నటుడిగా ఆయనతో పరిచయం ఏర్పడింది. చాలా బాగా మాట్లాడారు. ఎలా ఉండాలో చెప్పారు. కథల పరంగా ఏమైనా సలహాలు కావాలన్నా అడగమని కూడా చెప్పారు. అప్పటి నుంచి నాకేదైనా డౌట్ వస్తే ఆయనతో మాట్లాడుతూ వస్తున్నాను. పర్సనల్‌గా నాకవి ఎంతో హెల్ప్ అవుతూ వచ్చాయి. అన్నీ బాగా చేస్తున్నావ్. కాస్త మాస్ క్యారెక్టర్స్ కూడా చెయ్.. మాస్ అంటే కొడితే ఎగిరిపోవడం అనే స్టైల్లోకాకుండా కాస్త డిఫరెంట్‌గా ట్రై చెయ్ అని రీసెంట్‌గా ఆయన సలహా ఇచ్చారు.
- నా అదృష్టం కొద్దీ.. తదుపరి చేస్తున్న సినిమాలన్నీ గ్రామీణ నేపథ్యంలో చేస్తున్నాను. ఆ పాత్రలు మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి.
- చాలా మంచి కథ కుదిరింది. ఆ నమ్మకంతోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అలా మాట్లాడాను. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడానికి ఆలోచిస్తుంటారు. అలాంటి భయానికి ముందు నా కాన్ఫిడెన్స్‌ని ప్రెజంట్ చేస్తే బావుంటుందనిపించి స్టేజ్‌పై మాట్లాడాను. అయితే నేను చెప్పిన మాటలు హృదయంలో నుంచి వచ్చినవే.
Srivishnu
- కొత్త రకమైన స్టోరి టెల్లింగ్. బయటి లాంగ్వేజ్ చిత్రాలను ఓటీటీల్లో చూసి వాళ్లని పొగుడుతున్నాం కదా.. అలా రేపు మీరు కూడా మమ్మల్ని పొగుడుతారు. ఈజోనర్‌లో డిఫరెంట్ అటెంప్ట్.
- కొంటె దొంగ పాత్ర చేశాను. సినిమాలో క్యారెక్టర్స్ ప్రేక్షకులకు అర్థం కావడానికి పదిహేను నిమిషాల సమయం పడుతుంది. వెళ్లిన తర్వాత హీరో పాత్రను అందరూ ఇష్టపడదారు. సినిమాలో సిట్యువేషన్ కామెడీ ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్‌లో హీరో చెప్పేదంతా అబద్దాలే.
- హసిత్ దీని కంటే ముందు ఓ డిసిస్ ఓరియెంటెడ్ స్టోరిని నాతో చేద్దామని అనుకున్నారు. ఎక్స్‌ట్రార్డినరీ కథ. అలాంటి ఎక్స్‌పెరిమెంట్ చేయాలంటే చిన్న భయమేసింది. అంత కంటే ముందు మనల్ని ప్రూవ్ చేసుకోవాలనిపించింది. అందుకని ఈ కథతో ముందుకెళ్లాం.
- హిట్ ఇచ్చిన దర్శకులతో పనిచేస్తే రిలాక్స్ అయిపోతాం. అలా ఉండటం నాకిష్టముండదు. అదే కొత్త వాళ్లతో సినిమా చేస్తే ఓ భయం, బాధ్యత ఉంటాయి. హ్యాండిల్ చేస్తారని నమ్మకం వచ్చినప్పుడు వాళ్లు బిడ్డలాగే భావించే సినిమా కరెక్ట్ వస్తుంటే వాళ్లు పడే ఆనందం చూస్తే నాకొక కిక్ వస్తుంది. ఫస్ట్ నుంచి నాకు అలా అలవాటైంది.
- ఈ సినిమా చూసిన తర్వాత ముందు మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గురించే మాట్లాడుతారు.
- మేఘా ఆకాశ్, సునైన తెలుగువాళ్లే. కానీ తమిళ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేశారు. ఇక్కడ తక్కువగానే సినిమాలు చేశారు. ఈ సినిమా వారికి కూడా మంచి పేరు తెస్తుందనడంలో సందేహం లేదు.
- తదుపరి అర్జున పల్గుణలో ఓ సాంగ్ మాత్రమే బాలెన్స్ ఉంది. అలాగే భళా తందనాన షూటింగ్ జరుగుతుంది. ఇవి కాకుండా ఓ పోలీస్ సినిమా చేస్తున్నాను.. సగం పూర్తయ్యింది.