ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ చివరి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌కు చెందిన కొన్ని మ్యాచ్‌లకు కూడా గాయంతో తప్పుకున్నాడు. భుజం గాయంతో బాధపడుతున్న కోహ్లీ ఇకపై ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడుతాడని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదేంటి? గాయం నుంచి కోహ్లీ పూర్తిగా కోలుకున్నాడా? అనేదేగా మీ డౌట్.
గాయం నుంచి కోలుకున్నాడో లేదనే విషయాన్ని పక్కనబెడితే.. కోహ్లీ ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క బెంగళూరుకు వచ్చేసింది. అందుకే కోహ్లీ తప్పకుండా ఇకపై ఐపీఎల్‌లో పాల్గొంటాడని తెలిసింది. ఎందుకంటే భుజం గాయంతో బాధపడతున్న కోహ్లీని పరామర్శించింది. ఇంకేముంది? కోహ్లీకి ఫుల్ ఎనర్జీ లభించింనట్లైంది. దీంతో త్వరలో జరుగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కోహ్లీ పాల్గొంటాడని సమాచారం.
కాగా భుజం గాయంతో బాధపడుతున్న క్రికెటర్ విరాట్ కోహ్లిని ప్రియురాలు అనుష్క శర్మ పరామర్శించింది. ఈ విషయమై ఇటీవల బెంగళూరుకు వచ్చిన అనుష్క.. ప్రియుడ్ని కలుసుకుంది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి సోషల్ మీడియాలో అనుష్క వస్తే కోహ్లీ సరిగ్గా మ్యాచ్‌లు ఆడడని టాక్ వుంది. ఈ నేపథ్యంలో అనుష్క కోహ్లీ ఆడే ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు వస్తుందో.. లేదో?