ఐపీఎల్ ఇప్పుడు అవసరమా? ఇంగ్లండ్ మాజీ కామెంటేటర్

గురువారం, 29 ఏప్రియల్ 2021 (13:04 IST)
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితుల్లో కూడా ఐపీఎల్‌ను నిర్వహించడం ఏ మాత్రం సమంజసం కాదంటున్నారు. 
 
లీగ్‌ను కొనసాగించడం దారుణమైన తప్పిదమని ఇంగ్లండ్‌ మాజీ ఫుట్‌బాలర్‌, కామెంటేటర్‌ గ్యారీ లినేకర్‌ అన్నాడు. క్రికెట్‌ ఫ్యాన్‌గా ఐపీఎల్‌ను ఎంతో అభిమానిస్తా. కానీ, ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లీగ్‌ను కొనసాగించడం పెద్ద తప్పిదమే. మ్యాచ్‌లో పరుగుల కంటే వేగంగా ప్రాణాలు కోల్పోతున్నార్ణని లినేకర్‌ ట్వీట్‌ చేశాడు.
 
అనేక పత్రికలు కూడా విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్‌ను కొనసాగించడాన్ని నిలదీశాయి. లీగ్‌లో ఆడుతున్న తమ దేశ ఆటగాళ్ల క్షేమ సమాచారాన్ని ప్రచురించాయి. కాసులు కురిపించే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించకూడదు. వాటిల్లో ఐపీఎల్‌ అత్యంత పవిత్రమైనది్ణ అని గార్డియన్‌ పత్రిక సెటైర్‌ వేసింది. బీసీసీఐని కార్యదర్శి జై షానే నడిపిస్తున్నాడని ఆరోపించింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు