తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (7) మరోసారి నిరాశ పరచగా.. గత మ్యాచ్ సెంచరీ హీరో రజత్ పాటీదార్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్ (25), మ్యాక్స్‌వెల్ (24) ఫర్వాలేదనిపించారు.
రాజస్థాన్ బౌలర్లలోమెక్‌కాయ్, ప్రసిద్ధ్ కృష చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు చేసింది. బట్లర్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్అవార్డు దక్కింది. 10పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా పదోసారి. 2012 ఐపీఎల్ నుంచి ఈ పరంపర కొనసాగుతుంది.