తరావీహ్ నమాజులు పాపాలను పారద్రోలుతాయట!

FILE
"తరావీహ్" నమాజులు పాపాలను పారద్రోలే క్రతువులు. "షబేఖదర్" ఇదే నెలలో వచ్చే పుణ్యదినం. రంజాన్ మాసం ప్రారంభం అయ్యాక 27వ రోజు షబేఖదర్‌ను జరుపుతారు. ఆ రోజు రాత్రంతా మెలుకువతో ఉండి ప్రార్ధనలు జరిపితే వెయ్యి నెలలపాటు ప్రార్ధనలు జరిపినట్లు విశ్వాసం.

మళ్ళీ నెల రోజులకు నెలపొడుపును చూసేంతవరకు ఇవి కొనసాగుతాయి. ఉపవాసాలు ముగిసిన తర్వాతి రోజు రంజాన్ పండుగ జరుపుకుంటారు.

రంజాన్ రోజున మసీదుల వద్ద సామూహిక నమాజులు నిర్వహిస్తారు. ఉపవాసాలు ఉన్నవారికి ప్రత్యేకంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారు. కేవలం ఆహారం తీసుకోకపోవడమే ఉపవాస లక్షణం కాదు. ఆహారంతోపాటు వారు చెడు ప్రవర్తనకూ, చెడు చేష్టలకు కూడా దూరంగా ఉంటారు. కాబట్టి వారిలో దైవ భీతితో కూడిన నిస్వార్ధపరత్వం పెంపొంది ఆత్మ శుద్ధి చేసుకుని భగవంతుని దీవెనలు పొందుతారు.

వెబ్దునియా పై చదవండి