దేశం వ్యాప్తంగా రంజాన్ 'సందడే సందడి'

FileFILE
ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్ సంబరాలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడే సందడిగా ఉంది. పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా రంజాన్ ఉపవాస దీక్షలకు ముస్లింలు ముగింపు పలికారు. రాత్రంతా ఛార్మినార్, శాలిబండ, ఫత్తర్‌ఘట్టి. బెగంబజార్ తదితర ప్రాంతాలతో పాటు.. మక్కామసీదు, దేశ రాజధానిలోని జామా మసీదులు వేలాది మంది ముస్లిం సోదరులతో కిక్కిరిసి పోయింది. పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు.. దేశ వ్యాప్తంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఉపరాష్ట్రపతి అన్సారీ, భాజపా అగ్రనేత అద్వానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలతో పాటు.. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిలు ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి