ఈ మాసంలో నమాజులు, ఉపవాసాలు నియమానుసారంగా జరుగుతాయి. ఈ ఉపవాసాల వలన మానవాళి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. ఆకలి కోసం అలమటించే వారి బాధలను స్వయంగా అనుభవించడమే ఈ ఉపవాసాల ఉద్దేశం. దీనివల్ల ఉపవాసం ఉన్న వారిలో సాటివారిపట్ల సానుభూతితోపాటు దైవచింతన కూడా కలుగుతుందని భావన.
జకాత్, ఫిత్రాల పేరుతో అన్నార్తులకు వితరణ చేయడం పుణ్యాన్నిస్తుంది. మహమ్మద్ ప్రవక్త బోధించిన నియమాలను అనుసరించి ప్రతి రోజూ సూర్యోదయంలో జరిపే "సహరి" నుండి, సూర్యాస్తమం వరకు జరిపే "ఇఫ్తార్ వరకు మంచి నీళ్ళను సైతం త్యజించి కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. అతిథులు, అభ్యాతుల సాంగత్యంలో సహరీలు ఇఫ్తార్లు జరుపుకుంటారు.