ఆధార్ సెంటర్లో కనుక ఎక్కవ డబ్బులు వసూలు చేస్తే…?

సోమవారం, 9 ఆగస్టు 2021 (14:31 IST)
ఆధార్ సెంటర్లో కనుక ఎక్కవ డబ్బులు వసూలు చేస్తే… యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)కి కంప్లైంట్ చేయొచ్చు. ఆధార్ ఛార్జీలు ఎక్కువ తీసుకుంటే 1947 నెంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు. లేదు అంటే మీరు [email protected] మెయిల్ ఐడీకి మెయిల్ పంపి మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. 
 
ఇదీ కాక పోతే నేరుగా https://resident.uidai.gov.in/file-complaint ఈ లింక్ క్లిక్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఇలా ఈజీగా కంప్లైంట్ చేయచ్చు అని యూఐడీఏఐ తెలిపింది. యూఐడీఏఐ నిర్ణయించిన ఛార్జీల కన్నా ఎక్కువ వసూలు చేస్తే తప్పక ఫిర్యాదు చెయ్యండి అని అంటున్నారు.
 
ఇక దేనికి ఎంత ధర అనేది చూస్తే.. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్, డెమొగ్రఫిక్ అప్‌డేట్ ఉచితం. అలానే బయోమెట్రిక్ అప్‌డేట్, డెమొగ్రఫిక్ అప్‌డేట్ కోసం రూ.100 చెల్లించాలి. అదే ఒకవేళ డెమొగ్రఫిక్ అప్‌డేట్ కోసం అయితే మీరు రూ.50, ఇ-ఆధార్ డౌన్‌లోడ్, ఏ4 షీట్‌పై కలర్ ప్రింట్ ఔట్ కోసం రూ.30 చెల్లించాల్సి ఉంటుంది.
 
యూఐడీఏఐ 2021 ఏప్రిల్ లో ఈ చార్జీలుని ప్రకటించింది. దేశంలోని అన్ని ఆధార్ సెంటర్లు, ఆధార్ సేవా కేంద్రాల్లో ఇవే ఛార్జీలు వర్తిస్తాయి గమనించండి. మీరు ఏ సేవకి ఎంత ఛార్జ్ అవుతుంది అనే వివరాలు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు