ఉచితంగా యాక్సెస్‌.. అలాంటి మేసేజ్‌లను నమ్మొద్దు.. పోలీసులు

శనివారం, 24 ఏప్రియల్ 2021 (10:22 IST)
అమెజాన్‌ ప్రైమ్, నెట్‌ ఫ్లిక్స్‌ తదితర వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌‌లకు ఉచితంగా యాక్సెస్‌ అంటూ వచ్చే మెసేజ్‌‌లను నమ్మ వద్దని పోలీసులు వాట్సాప్ వినియోగదారులకు సూచించారు. ఇలాంటి లింకులు మీ స్మార్ట్‌ ఫోన్లోని విలువైన డేటాను చోరీ చేస్తాయని స్పష్టం చేశారు. ఇలాంటి మెసేజ్‌‌లు ఏమైనా వస్తే వాటిపై క్లిక్‌ చేయవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్‌ కూడా చేయవద్దని స్పష్టం చేశారు. 
 
"Get 2 months of Amazon Premium Free anywhere in the world for 60 days. http://profilelist.xyz/?livestream” ఈ లింక్‌ లపై క్లిక్‌ చేస్తే మనకు తెలియకుండానే మన స్మార్ట్‌ ఫోన్లోని బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరుతుందని తెలిపారు.
 
క్రెడిట్‌ కార్డు వివరాలు, పాస్వర్డ్‌ లు, మెసేజ్‌ లు, ఫొటోలు కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తాయని స్పష్టం చేశారు. వాట్సాప్‌ వినియోగదారలు ఇలాంటి మెసేజ్‌‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు