వామ్మో.. తప్పుడు ప్రకటనలు.. ఎయిర్‌టెల్, అముల్, ఆపిల్, కోక్ సంస్థలు కూడా?

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (12:06 IST)
జియో ఆఫర్లతో వినియోగదారుల పంట పండుతోంది. ఇందుకు పోటీగా టెలికాం సంస్థలన్నీ పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ ఆఫర్ల ప్రకటనలను నిజమనుకుని వినియోగదారులు ఆరాతీస్తే.. ఆఫర్ల పేరిట మోసం జరుగుతుందని ఫిర్యాదులు రావడంతో ఎడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వాచ్ డాగ్ ఆస్కీ) అప్రమత్తమైంది.
 
తప్పుడు టెలివిజన్ ప్రకటనలు ఇస్తూ.. తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు రావడంతో.. 143 కంపెనీలకు వాచ్ డాగ్ ఆస్కీ షాకిచ్చింది. తమకు అందిన 191 ఫిర్యాదులను పరిశీలించిన తరువాత 143 కంపెనీల ప్రకటనలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అమూల్, నివియా, భారతీ ఎయిర్ టెల్, ఆపిల్, కోకకోలా, థమ్స్ అప్ తదితర ఎన్నో కంపెనీలను తప్పుబట్టింది. 
 
ఎయిర్ టెల్‌పై వచ్చిన మూడు ఫిర్యాదులు నిజమేనని, ఐఫోన్ సంస్త ఏడు వేరియంట్ కోసం తప్పుడు ఇమేజ్‌ను చూపిస్తూ ప్రచారం చేస్తుందని తెలిసింది. రిన్ సోప్ యాంటీ బ్యాక్టీరియా ప్రకటన తప్పని, కోకకోలా చూపుతున్న సాహసాలు అత్యంత ప్రమాదకరమని, ఆరోగ్య విభాగంలో 102, విద్యా విభాగంలో 20, పర్సనల్ కేర్ విభాగంలో 7 ఫిర్యాదులను అంగీకరించినట్టు వాచ్ డాగ్ ఆస్కీ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి