FIFAWorldCup2018 ఆఫర్ .. రూ.149 ప్లాన్‌తో రోజుకు 4 జిబి డేటా

గురువారం, 14 జూన్ 2018 (10:32 IST)
ప్రతిష్టాత్మక సాకర్ పోటీలను పురస్కరించుకుని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తాజాగా ఓ సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.149 ధరతో ఈ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ కింద తీసుకున్నవారికి 4జీబీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇదే తరహా రిలయన్స్ జియో కూడా తమ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చిన విషయం తెల్సిందే.
 
'ఫిఫా వరల్డ్‌ కప్‌ స్పెషల్‌ డేటా ఎస్‌టివి 149' పేరుతో సంస్థ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రోజుకు 4జీబీ 3జీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ నెల 14 నుంచి జూలై 15 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. అయితే ఎస్‌టివి 149తో రీచార్జ్‌ చేసుకుంటే ఉచిత వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు వర్తించవని అన్ని బీఎస్ఎన్ఎల్ సర్కిల్స్‌లో అందుబాటులోకి ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు