బీఎస్ఎన్ఎల్‌ నుంచి త్వరలో 5జీ సేవలు.. వచ్చే ఏడాది నుంచే..?

బుధవారం, 21 మార్చి 2018 (10:50 IST)
రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వచ్చే ఏడాది 5 జీ సేవలను దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ సంస్థ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇందుకోసం నోకియా, జడ్‌టీఈ, ఎన్టీటీ వంటి సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు.
 
అదేవిధంగా ఒక లక్ష వరకు వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేసి సంస్థ రెవెన్యూ రూ200-250 కోట్ల వరకు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు దేశంలో బీఎస్ఎన్‌ఎల్‌కి 3జీ సేవలు మాత్రమే వున్నాయి. 
 
కానీ ఈ ఏడాది చివరినాటికి ఢిల్లీ, ముంబై తప్ప దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ 4జీ సేవలను ప్రారంభిస్తామని శ్రీవాస్తవ వెల్లడించారు. కేరళలో మినహా అన్ని ప్రాంతాల్లోనూ బీఎస్ఎన్ఎల్ 3జీ సేవలు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో వున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు