రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. కాగా ఈ 'ఉచితాలు' 60 రోజులు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. దీనిపై మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది. అరవై రోజుల ఉచిత కాలపరిమితి ముగిసిన తర్వాత వాయిస్, డేటా వోచర్స్ అవసరమవుతాయి.
ప్రస్తుతం కేరళ, ఆంధ్రప్రదేశ్, అసోం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కోల్‌కతా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు(చెన్నై), చత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్తాన్, యూపీ ఈస్ట్, యూపీ వెస్ట్ వంటి ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టారు.
ఈ ప్లాన్ కింద రెండు నెలల పాటు పలు ఉచితంగా పలు ఆఫర్లను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. వీటిలో రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్‌తో పాటు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు ఉన్నాయి. రోజులో 2జీబీ డేటా పూర్తయ్యాక ఇంటర్‌నెట్ వేగం 80 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఇవి కేవలం తొలి రెండు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక మిగిలిన పది నెలలూ ఎలాంటి ఆఫర్లు ఉండవు.