బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. కరోనా కారణంగా ఇప్పటికే పలువురు ఇళ్లవద్దే పనిచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అలాంటి వారి కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 'వర్క్ ఫ్రమ్ హోమ్' ను బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. కొత్త ఆఫర్ ద్వారా ఇంటి నుండి పని చేయడానికి, ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగించవచ్చని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సిఎఫ్ఎ వివేక్ బంజాల్ చెప్పారు.
ఈ ప్లాన్‌లో ల్యాండ్‌లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల రోజులు పాటు ఈ సేవలను అందించనుంది. వ్యవధి ముగిసిన తరువాత, పైప్లాన్ కింద ఉన్న కస్టమర్లు వారి ఉపయోగాల ప్రకారం సాధారణ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు మారతారని బీఎస్‌ఎన్‌ఎల్ తన సర్క్యులర్‌లో తెలిపింది.
ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్‌ఎస్ డౌన్ స్పీడ్‌ను, రోజుకు 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఒకవేళ డేటా పరిమితి అయిపోతే, డేటా వేగం 1 ఎంబీపీఎస్‌కు పరిమితమవుతుంది.