బీఎస్ఎన్ఎల్‌ మొబైల్ యూజర్లకు కొత్త ప్లాన్.. రూ.108తో రీఛార్జ్ చేసుకుంటే..?

శనివారం, 3 ఏప్రియల్ 2021 (12:14 IST)
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌(బీఎస్ఎన్ఎల్‌) మొబైల్ యూజర్లకు కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.108తో రీచార్జ్ చేసుకున్నవారికి 60 రోజలు పాటు ప్రతి రోజు 1జీబీ డేటాను ఇవ్వనున్నది. ప్రైవేటు కంపెనీల కన్నా మెరుగైన రీతిలో ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లను ఆకట్టుకుంటున్నది. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ సంస్థలు తమ ప్లాన్‌లో 1జీబీ డేటాను కేవలం 28 రోజులకు లేదా 56 రోజుల కాలపరిమితితో ఇస్తున్నారు. 
 
బీఎస్ఎన్ఎల్ తన రూ.108 కొత్త ప్లాన్‌లో 1జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆఫర్‌ను కూడా ఇచ్చింది. ఒకవేళ డెయిలీ డేటా పూర్తి అయితే, అప్పుడు ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్‌, అప్‌లోడింగ్ స్పీడ్‌ను 80కేబీపీఎస్‌తో ఇవ్వనున్నారు. ఈ కొత్త ప్యాక్ ఢిల్లీ, ముంబై ఎంటీఎన్ఎల్ నెట్వర్క్స్‌లో అందుబాటులోకి వచ్చింది. రూ.47కే ఫస్ట్ రీచార్జ్‌, రూ.109 ప్లాన్ వోచర్‌, రూ.998, రూ.1098 లాంటి స్పెషల్ టారిఫ్ వోచర్స్ ను బీఎస్ఎన్ఎల్ రద్దు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు