దేశీయ టెలికాం రంగంలో ఏర్పడిన విపరీతమైన పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్తగా మూడు ఆఫర్లను ప్రకటించింది. ఇవి మూడు జియోకు షాకిచ్చేలా ఉన్నాయి. రూ.333 ప్లాన్‌ను తీసుకొన్న బిఎస్ఎన్‌ఎల్ వినియోగదారులకు ప్రతి రోజూ 3 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ఇది 90 రోజులవరకు ఈ ఆఫర్ వర్తిస్తోంది. ఈ ఆఫర్‌ను తీసుకొన్న కస్టమర్లకు 270 జీబీ హై వేగంతో 3 జీబీ డేటా అందుతోంది.
అలాగే, 'దిత్ కోల్ కే బోల్' పేరుతో రూ.349 ప్లాన్‌ను బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ పథకం కింద ఎస్టీడీతో పాటు లోకల్ కాల్స్‌ను కూడా అపరిమితంగా ఇవ్వనున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 2 జీబీ డేటాను 3జీబీ డేటా స్పీడ్‌తో ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్ రిలయన్స్ జియో ధనాధన్ ఆఫర్ తరహాలోనే ఉంది. ప్రతిరోజూ 1 జీబీ 4 జీబీ డేటాను అందించనుంది. ఈ ఆఫర్ 84 రోజులపాటు ఉంటుంది.
చివరగా, రూ.395 ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ 3 వేల నిమిసాలపాటు బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ ఫోన్లకు ఉచితంగా మాట్లాడుకొనే సౌకర్యాన్ని కల్పించింది. మరో వైపు 1800 నిమిషాల పాటు ఇతర నెట్‌వర్క్‌లకు చెందిన కంపెనీల ఫోన్‌లకు ఉచితంగా మాట్లాడుకొనే వెసులుబాటు కల్పించింది. 2 జీబీ డేటాను 3 జీబీ స్పీడ్‌తో అందించనుంది బిఎస్ఎన్‌ఎల్. ఈ పథకం 71 రోజుల వరకు వర్తిస్తోంది.