టెక్నాలజీ పేరుతో ఘరానా మోసం... అలా చేస్తే అకౌంట్‌లో డబ్బు గల్లంతే.

గురువారం, 7 నవంబరు 2019 (10:21 IST)
హైటెక్ టెక్నాలజీ మోసగాళ్లకు అడ్డాగా మారుతోంది. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అందులో ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో విపరీతమైన మోసాలు జరుగుతున్నాయి. ప్రధానంగా బ్యాంకు ఖాతాలు ఉన్న వారిని టార్గెట్ చేస్తూ.. ఈ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. 
 
స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న కస్టమర్లు జాగ్రత్తగా లేకపోతే.. వారి అకౌంట్‌లో ఉన్న డబ్బు కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందులో భాగంగా బ్యాంక్‌ అకౌంట్‌లో ఇచ్చిన ఫోన్ నంబర్‌ను ఉపయోగిస్తున్న ఫోన్‌తో జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా కొన్ని పనులకు దూరంగా ఉండాల్సిందే. లేదంటే అకౌంట్‌లో డబ్బు గల్లంతే.
 
స్మార్ట్ ఫోన్ కలిగిన వినియోగదారుడు చేయకూడని పనులు ఏంటంటే...
 
* మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్ ఎట్టిపరిస్థితుల్లో ఎవ్వరికీ చెప్పరాదు. 
* పాస్‌వర్డ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఫోన్‌లో కూడా నిక్షిప్తం చేయకూడదు. 
* డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పిన్, ఎంపిన్, కార్డుల సమాచారాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు. (బ్యాంకు వాళ్లు ఎవరు కూడా ఈ సమాచారాన్ని అడగరు)
 
* అంతేకాదు.. ఫోన్‌కు ఓటీపీ వచ్చిందంటూ ఎవరు ఫోన్ చేసి అడిగిన తిరస్కరించాలి.
* బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి వాటిని ఎవరైనా కాల్ చేసి అడిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పొద్దు.
* ఎవరైనా కొత్త వ్యక్తి మీ ఫోన్‌లో.. కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోమని చెబితే అస్సలు నమ్మొద్దు.
* అంతేకాదు.. ఎవరైనా మీ ఫోన్ సెట్టింగ్స్ మార్చమని కోరితే తిరస్కరించండి.
* గూగుల్ సెర్చ్‌‌లో వెతికితే వచ్చే బ్యాంక్, మర్చంట్, కంపెనీల కస్టమర్ కేర్ నెంబర్లతో జాగ్రత్త..అందులో కొన్నిఫేక్ నెంబర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
 
* మీకు వచ్చిన ఎస్ఎంఎస్‌ను పంపమంటే కూడా.. పంపొద్దు.
* మొబైల్ నెంబర్, అడ్రస్, పుట్టిన తేదీ, ఆధార్ వంటి వివరాలను సోషల్ మీడియాలో పెట్టకపోవడం ఎంతో మంచిది
* పేమెంట్ గేట్‌ వేస్ యాప్‌లు.. మొబైల్ బ్యాంకింగ్ సంబంధిత యాప్స్‌కు యాప్ లాక్ పెట్టుకోవడం బెటర్
* ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్‌లో.. మీకు తెలియకుండా ఏమైనా మోసపూరిత ట్రాన్సాక్షన్స్ జరిగితే.. వెంటనే బ్యాంక్‌లో ఫిర్యాదు చేయాల. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు