ప్లస్ టూ పరీక్షలు ముగిసిన ఆనందంలో సముద్రం వెళ్లారు.. ఏం జరిగిందో తెలుసా..?

బుధవారం, 20 మార్చి 2019 (17:20 IST)
ఎప్పుడూ సముద్రానికి వెళ్లున్నాం కానీ ఒక్కసారి కూడా ఈత కొట్టలేదని కొంతమంది విద్యార్థులు కడలూరులోని సముద్రానికి వెళ్లారు. ఈసారి ఎలాగైనా ఈత కొట్టాలంటూ సముద్రంలోకి దిగారూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈత కొట్టే సమయంలో పెద్ద పెద్ద అలలు రావడంతో విద్యార్థులు మరణించారు. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరులో చోటుకుంటుంది. మరిన్ని వివరాలు పరిశీలించగా..
 
ప్లస్ టూ పరీక్షలు ముగిసిన ఆనందంలో 9 మంది విద్యార్థులు సరదాగా సముద్రంలో ఈతకు వెళ్లారు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా భారీ అలల రావడంతో నలుగురు విద్యార్థులు నీటిలో మునిగి మరణించారు. ఒక విద్యార్థి మాత్రం సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ ప్రమాదంలో మిగిలిన నలుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. నా బిడ్డ పరీక్ష ముగించుకుని ఇంటికి వస్తాడని తల్లిదండ్రులు ఎంతగానో వేచి చూసుంటారు. కానీ, ఇంత విషాదం చోటుచేసుకుంది.    

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు