డిజిటల్‌ లావాదేవీలదే పైచేయి.. 80 శాతం పెరుగుదల

ఆదివారం, 5 నవంబరు 2017 (10:21 IST)
దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్‌ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2017-18లో 80 శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1000 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. 
 
ఈ విలువ 2016-17లో మొత్తం డిజిటల్‌ లావాదేవీలతో సమానం. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి రూ.1800కోట్ల విలువైన డిజిటల్‌ లావాదేవీలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతినెలా సగటున రూ.136 నుంచి రూ.138 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నట్టు ఈ శాఖ వెల్లడిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి