రూ.500, రూ.1000 రద్దుతో ఆయా సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్, వంటి సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ సేవలను ఇప్పటికే రద్దు చేయగా వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
అమెజాన్ తన సేవలను రద్దు చేసుకోగా… ఫ్లిప్ కార్ట్ మాత్రం రూ.2 వేలకు మించి ఆర్డర్లు ఉంటేనే క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కల్పిస్తోంది. అంతేకాదు రూ.500 రూ.1000 తీసుకోరని ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో మెన్షన్ చేసింది. మరికొన్ని ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులు క్యాష్‌లెస్ పద్దతుల ద్వారా చెల్లింపులు చేయాలని కోరుతున్నాయి.