రానున్న మూడేళ్ళలో భారత్‌లో 5జీని రియాల్టీలోకి తీసుకునేందుకు మొత్తం ఎకో-సిస్టమ్ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా సిన్హా వెల్లడించారు. ఆరోగ్యం, విద్య, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మరికొన్ని ఇతర రంగాల్లో 5జీ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సిన్హా వెల్లడించారు.
భారత్‌లో డేటా వినియోగదారులు అధికసంఖ్యలో ఉన్నారని, ప్రపంచంలోని అన్నీ దేశాల్లో కన్నా భారత్ లోనే డేటా వినియోగం అధికంగా ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాయ్ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ తెలిపారు. 5జీ సేవలు ప్రారంభమైతే ఇక అన్నీ రంగాల్లో భారత్ దూసుకెళ్లడం ఖాయమని హర్షం వ్యక్తం చేశారు.