ఫేస్‌బుక్ గత కొన్నాళ్లుగా బోల్డన్ని ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెల్సిందే. ఫలితంగా స్మార్ట్‌ఫోన్లలో యాప్‌ల వెల్లువను తగ్గిస్తోంది. వాతావరణం, డిస్కవర్ పీపుల్, సిటీ గైడ్స్, టౌన్‌హాల్.. తదితర వాటిని ప్రారంభించింది. తాజాగా ఆహారం కోసం 'ఆర్డర్ ఫుడ్' ఆప్షన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
నిజానికి మనకు ఇష్టమైన ఆహారాన్ని పొందాలంటే సమీపంలో ఉన్న రెస్టారెంట్స్ లేదా హోటల్స్‌కు వెళ్లడం చేయాలి. లేదా ఫోన్‌లో హోమ్ డెలివరీ బుక్ చేసుకోవాలి. ఇకపై రెస్టారెంట్ల వెబ్‌సైట్లు కానీ, యాప్‌లు కానీ ఓపెన్ చేయాల్సిన పనిలేకుండా నేరుగా ఫేస్‌బుక్ ద్వారా ఉన్న చోటు నుంచే ఫుడ్‌ను ఆర్డర్ చేయవచ్చు.
డెలివరీ డాట్ కామ్, స్లైస్ ద్వారా ఫేస్‌బుక్ యూజర్లు ఫుడ్ పికప్, డెలివరీ ఆర్డర్లు చేసుకోవచ్చని ‘టెక్ క్రంచ్’ తెలిపింది. గత డిసెంబరులోనే పేస్‌బుక్ డెలివరీ డాట్ కామ్, స్లైస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అది మరికొన్ని రోజుల్లో కార్యరూపం దాల్చనుంది.