ప్రముఖ సోషల్ మీడియా ప్రసార మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఆరు గంటల పాటు స్తంభించిపోయాయి. సోమవారం సాయంత్రం గత రాత్రి 9 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల సేవలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఈ కారణంగా కొన్ని వందల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది.
కాగా, గత రాత్రి సామాజిక మాధ్యమాలన్నీ ఒక్కసారిగా మూగబోవడంతో ఏం జరుగుతోందో అర్థంకాక వినియోగదారులు అయోమయానికి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ట్విట్టర్ ద్వారా ప్రయత్నించారు. కాగా, ఫేస్‌బుక్‌కు భారత్‌లో 41 కోట్ల మంది, వాట్సాప్‌కు 53 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌కు 21 కోట్ల మందికిపైగా వినియోగదారులున్నారు.