ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ సైతం ఇలాంటి అవాస్తవాల ప్రచారాలకు వేదికగా మారుతోంది. దీంతో యూజర్లను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గత నెల వెల్లడించారు. దీనిపై ఫేస్‌బుక్ నిపుణుల బృందం దీనిపై కసరత్తులు ప్రారంభించింది.
అయితే ఇటీవల ఫేక్ ఇన్ఫర్మేషన్‌కు సంబంధించి యూజర్లను అలర్ట్ చేసే ఫీచర్‌ను ఫేస్‌బుక్ టెస్ట్ రన్ చేసిందని, ఓ వినియోగదారుడి మొబైల్ స్క్రీన్‌పై 'నమ్మదగిన సోర్స్ కాదు' అంటూ ఫేస్‌బుక్ వార్నింగ్ లేబుల్ కనిపించిందని కోన్ని వెబ్ సైట్లు కథనాలు ప్రచురించాయి.