ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ డేస్ సేల్..చౌక ధరకు మొబైల్ ఫోన్లు..

సోమవారం, 24 ఆగస్టు 2020 (16:37 IST)
ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ మంగళవారం వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా చౌకైన ఐఫోన్లు కొనడానికి బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్‌లో వేలాది రూపాయల తగ్గింపు కూడా ఇస్తున్నారు. 
 
ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ ఏడాది ప్రారంభించిన ఐఫోన్ ఎస్ఈ ఇక్కడ తక్కువ ధరకు లభిస్తుంది. అదేవిధంగా, ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ 11 లపై విపరీతమైన తగ్గింపులు ఉన్నాయి. మొత్తం మూడు ఫోన్లు ఇక్కడ చాలా చౌకగా లభిస్తాయి.
 
ఐఫోన్ ఎస్ఈ : ఫ్లిప్‌కార్ట్ యొక్క ఆపిల్ డేస్ సెల్‌లో ఈ ఫోన్ కేవలం రూ.35,999కు లభిస్తుంది. ఈ శ్రేణి మోడల్‌లో 64 జీబీ స్టోరేజ్ ఉంది. లాంచ్ చేసే సమయంలో ఈ మోడల్ ధర రూ.42,500. అదే సమయంలో 128 జీబీ ఐఫోన్ ఎస్‌ఈ ధరను రూ.40,999 వద్ద ఉంచారు. 
 
ఐఫోన్ ఎక్స్‌ఆర్ 64 జీబీ ఐఫోన్ ఎక్స్‌ఆర్‌ను రూ.45,999 ధరకు కొనడానికి మంచి అవకాశం ఉంది. అదే సమయంలో 128 జీబీ ఐఫోన్ ఎక్స్‌ఆర్ ధరను రూ.51,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ఎరుపు, నీలం, నలుపు, పగడపు, తెలుపు, పసుపు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 11 కూడా భారీగా తగ్గింపు ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు