ఇంటర్నెట్ లేకుండా జీమెయిల్ చెక్ చేసుకోవచ్చు..

బుధవారం, 29 జూన్ 2022 (19:34 IST)
ఇంటర్నెట్ లేనిదే అడుగు ముందుకు పడని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారికి గూగుల్ సపోర్ట్ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది గూగుల్. ఇకపై ఇంటర్‌నెట్‌ కనెక్షన్ లేకుండానే జీమెయిల్‌లో వచ్చిన మెసేజ్‌లను చదువుకోవచ్చు. 
  
జీమెయిల్‌ సందేశాలను యాక్సెస్ చేయడానికి ఇంటర్నెట్ అవసరాన్ని తొలగించే కొత్త ఫీచర్‌తో జీమెయిల్‌కు వచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో మీరు ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా కూడా మీ మెసేజ్‌లు చదవవచ్చు. ప్రతిస్పందించవచ్చు. సెర్చ్ చేసుకోవచ్చు కూడా.
 
కొత్త ఫీచర్‌ని గూగుల్‌ సపోర్ట్ అని పిలుస్తారు. దీంతో  మీరు mail.google.comని సందర్శించడం ద్వారా మీరు ఇంటర్నెట్‌ లేనప్పుడు కూడా మీ మెసేజ్‌లు చదవవచ్చు. 
 
జీమెయిల్‌ను ఆఫ్‌లైన్‌లో యాక్సెస్ చేయగలిగేలా చేయడానికి క్రోమ్‌లో పేర్కొన్న లింక్‌ను బుక్‌మార్క్ చేయమని గూగుల్‌ సిఫార్సు చేస్తుంది. మీరు మీ కార్యాలయం లేదా పాఠశాల ఖాతాతో జీమెయిల్‌ను ఉపయోగిస్తుంటే, సెట్టింగ్‌లను మార్చుకోవాల్సి ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు