యువతిని వేధించిన ఫుడ్ డెలివరీ బాయ్ - సారీ చెప్పిన స్విగ్గీ

ఆదివారం, 19 జూన్ 2022 (13:27 IST)
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో పని చేసే ఓ డెలివరీ బాయ్ చేసిన పనికి ఆ సంస్థ యాజమాన్యం సారీ చెప్పింది. ఓ యువతికి ఆమె ఆర్డరిచ్చిన ఫుడ్‌ను డెలివరీ చేసిన తర్వాత ఆ యువతికి వరుస సందేశాలు పంపాడు. "మిస్ యు లాట్, నైస్ యువర్ బ్యూటీ, నైస్ యువర్ ఐస్" వంటి సందేశాలు పంపించాడు. దీంతో ఆ యువతికి చిర్రెత్తుకొచ్చింది. స్విగ్గీ కస్టమర్ కాల్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ స్విగ్గీ యాజమాన్యం స్పందించలేదు. 
 
దీంతో ఆ యువతి మరింత ఆగ్రహం చెంది, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది వైరల్ కావడంతో దిగివచ్చిన స్విగ్గీ... తమ మహిళా కష్టమర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని, మరోమారు ఇలాంటివి జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పనికి మాత్రం నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు