ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక సంస్థలుగా ఫేస్‌బుక్, గూగుల్‌కు మంచి పేరుంది. డేటా, కృత్రిమ మేధస్సుతో కూడిన సాంకేతికతలను ఉపయోగించే అత్యంత శక్తివంతమైన కంపెనీల్లో కొన్ని.. ప్రపంచ ఆర్థిక లావాదేవీలను నియంత్రణలో వుంచుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ క్రిస్టియన్ లాగార్డే హెచ్చరించారు.
జీ20 దేశాల్లో పాల్గొనే ఆర్థిక మంత్రుల సమావేశం జపాన్‌లో జరిగింది. ఈ సమావేశంలో భాగంగా క్రిస్టియన్ లాగార్డే ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయన పేర్కొన్న అతిపెద్ద సాంకేతిక కలిగి సంస్థల్లో గూగుల్, ఫేస్‌బుక్‌లు వున్నాయి. ఇలాంటి సంస్థలు ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లోకి ప్రవేశించడాన్ని నియంత్రించాలని.. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతోంది