అలాంటి వీడియోలు త్వరలో నిషేధం.. తేల్చేసిన యూట్యూబ్

గురువారం, 6 జూన్ 2019 (15:09 IST)
జాత్యహంకార, మత ఘర్షణలకు సంబంధించిన వీడియోలపై యూట్యూబ్ కన్నెర్ర చేసింది. అలాంటి వీడియోలపై నిషేధం విధించనున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది. న్యూజిలాండ్‌లో మసీదులో జరిగిన దాడులను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. దీంతో ప్రపంచ అగ్ర నేతలు సామాజిక మాధ్యమాలు ఉగ్రవాదాన్ని నిరోధించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
దీన్ని దృష్టిలో పెట్టుకున్న యూట్యూబ్.. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో జాత్యంహకార వీడియోలను పోస్టు చేయకూడదని.. ఇలాంటి వీడియోలపై నిషేధం విధించనున్నట్లు తెలిపింది. ఈ నిషేధం త్వరలో అమల్లోకి రానుందని.. ఇందుకు కొన్ని నెలల సమయం పడుతుందని యూట్యూబ్ ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు