పిక్సెల్ 5a 5G ఫోన్‌లో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 12 MP మెయిన్ కెమెరా, 16 MP అల్ట్రా-వైడ్ కెమెరా వంటివి అందించింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ప్రత్యేకంగా 8 MP స్నాపర్ కెమెరాను చేర్చింది.
కెమెరా ఫీచర్లన్నీ 4ఎ, 5ఎ డివైజ్‌లలో ఒకే రకంగా ఉన్నప్పటికీ.. బ్యాటరీ సామర్థ్యంలో మాత్రం తేడాలున్నాయి. పిక్సెల్ 4 ఎలో 3,885 mAh బ్యాటరీని అందించగా.. పిక్సెల్ 5 ఎ డివైజ్‌లో 4,680 ఎంఏహెచ్ బ్యాటరీని చేర్చింది. ఈ బ్యాటరీలు 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్ధతిస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌పై పని చేస్తుంది.