ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని నోటికొచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని, నిజంగా ఈ రోజు ఒక బ్లాక్ డే అని చెప్పారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమ వంటి వారిని చంద్రబాబు పరామర్శించడం ఏమిటి? అని ప్రశ్నించారు.
నిజాయితీ రాజకీయాలు చేయాలంటే దళితుల వెనుక నిలవాలి కానీ చంద్రబాబు మాత్రం తన నైజాన్ని ఎన్నటికీ మార్చుకోడన్నారు. ఇంక ఎన్ని ఎన్నికలు వచ్చినా దళితులు, బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈయన్ని నమ్మరు...ప్రతి వర్గానికి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.
మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించేందుకు గొల్లపూడికి వెళ్ళిన చంద్రబాబును అడ్డుకునేందుకు దళిత వర్గాలు అక్కడ ప్రయత్నించాయి. అయితే, భారీ పోలీసు బందోబస్తు వల్ల అది సాధ్యం కాలేదు. ఈ చర్య సరికాదని, చంద్రబాబు దళితులను రెచ్చగొడుతున్నారని ఎంపీ నందిగం సురేష్ ఆరోపిస్తున్నారు.