దేశంలో స్మార్ట్ ఫోన్లు అమ్మకం కోసం గూగుల్ స్టోర్లు

బుధవారం, 27 డిశెంబరు 2017 (12:29 IST)
సెర్చింజన్‌గా పేరున్న గూగుల్ సంస్థ ఇక స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాల కోసం భారత్‌లో స్టోర్లను ప్రారంభించేందుకు గూగుల్ సన్నద్ధమనుతోంది. గూగుల్ స్టోర్లు తెర‌వ‌డం ద్వారా ఇప్ప‌టికే పాగా వేసిన శాంసంగ్‌, షియోమీ, ఒప్పో, వీవో వంటి మొబైల్ త‌యారీ సంస్థ‌లకు గ‌ట్టి పోటీ ఏర్ప‌డ‌నుంద‌ని విశ్లేషకులు అంటున్నారు. 
 
మొబైల్ వినియోగదారులను ఎక్కువగా కలిగి వున్న దేశాల్లో ప్రపంచంలోనే రెండో పెద్ద దేశమైన భారత్‌లో తమ మార్కెట్‌ను విస్తృత పరుచుకునేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈ స్టోర్లను తెరిచేందుకు గూగుల్ ప్రయత్నిస్తోందని గూగుల్ కంపెనీ మార్కెటింగ్ వర్గాల సమాచాంరం. 
 
ఈ స్టోర్ల ద్వారా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల‌ను ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మేందుకు వీలుంటుంది. తొలుత దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీలలో గూగుల్ రీటైల్ షోరూమ్‌లను ప్రారంభిస్తారని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు