విశ్వంలోని మిస్టరీని నాసా ఛేదించింది. అంతరిక్షంలో మరో సౌర కుటుంబం ఉన్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. కెప్లర్ టెలిస్కోప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో.. భూమికి 2,545 కాంతి సంవత్సరాల దూరంలో ఈ సౌర వ్యవస్థ ఉన్నట్లు నాసా అధికారులు ప్రకటించారు.
అయితే, ఈ సౌర వ్యవస్థలో జీవరాశి మనుగడ సాగించేందుకు అవకాశమే లేదని చెప్పారు. కొత్తగా కనుగొన్న సౌర వ్యవస్థలోని కెప్లర్ 90ఐ గ్రహంలో రాళ్లు, పర్వతాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.