చిన్నారుల కోసం.. గూగుల్ ప్లే స్టోర్‌లోని మూడు యాప్‌ల తొలగింపు

శనివారం, 24 అక్టోబరు 2020 (18:57 IST)
play Store
గూగుల్ ప్లే స్టోర్‌లోని మూడు పాపులర్ యాప్‌లకు గూగుల్ షాకిచ్చింది. చిన్నారుల కోసం రూపొందించిన ఆ యాప్స్ డేటాను దోచేస్తున్నాయనే కారణాలతో డిలీట్ చేశారు. ఇంటర్నేషనల్ డిజిటల్ అకౌంటబిలిటీ కౌన్సిల్ (ఐడిసిఏ) ఈ యాప్స్ విషయంలో ఆందోళన వ్యక్తం చేయడంతో ప్లే స్టోర్ నుంచి వాటిని తొలగించారు.

ప్రిన్సెస్ సలోన్, నంబర్ కలరింగ్, క్యాట్స్ అండ్ కాస్ప్లే అనే మూడు యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. అంతేకాదు డేటాను సేకరించి ఇతరులకు చేరవేస్తూ ఉన్నాయని తేలింది. దీంతో వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించక తప్పలేదని గూగుల్ వెల్లడించింది.
 
అలాగే ఈ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లడం చాలా ప్రమాదకరమని ఇంటర్నేషనల్ డిజిటల్ అకౌంటబిలిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ క్వెంటిన్ పాల్ఫ్రే చెప్పారు. నిబంధనలను అతిక్రమించినట్లు తెలిసిన వెంటనే తాము చర్యలు తీసుకుంటామని.. గతంలో కూడా పలు యాప్స్ మీద వేటు వేశామని.. భవిష్యత్తులో కూడా నిబంధనలను బేఖాతరు చేసిన యాప్స్ మీద కఠినంగా వ్యవహరిస్తామని గూగుల్ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు