ట్విటర్‌కు భారత సంతతికి చెందిన కొత్త సీఈవో

మంగళవారం, 30 నవంబరు 2021 (08:26 IST)
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన 45 యేళ్ల పరాగ్ అగర్వాల్‌ను నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ట్విట్టర్‍‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా కొనసాగుతున్నారు. 
 
ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పరాగ్ స్టాన్‌ఫోర్డ్‌లో పీహెచ్‌డీ చేశారు. తన నియామకంపై ఆయన స్పందిస్తూ, ఈ పదవిని చేపట్టడం చాలా గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. డోర్సే మార్గదర్శనం, స్నేహం కొనసాగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఆయనకు కృతజ్ఞతలన్నారు.
 
అలాగే, పరాగ్ నియామకంపై డోర్సే స్పందిస్తూ, పరాగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కంపెనీ అవసరాలను ఎంతో లోతుగా అర్థం చేసుకున్నారు. ట్విట్టర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆయన ఉన్నారు. సీఈవోగా ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు