తాజాగా త్రిబాణధారి బార్బరిక్ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఆయన చిత్రానికి దర్శకుడు మారుతీ కూడా సపోర్ట్ గా నిలిచాడు. సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే విడుదలైన రోజు సినిమా బాగుందని రిపోర్ట్ లు రావడంతో ఆనందంలో వున్నారు. కానీ నిన్న ఆదివారంనాడు ఒక్కసారిగా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.
దర్శకుడు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నిన్న కొన్నిథియేటర్లకు వెళ్ళాను. పది మంది కంటే ఎక్కువ ప్రేక్షకులు లేరు. వున్న వారిని సినిమా గురించి అడిగితే చాలా బాగుందని చెప్పారు. మరి సినిమా బాగుంటే ఎందుకని జనాలు రావడంలేదని వాపోయారు. మన దగ్గర మలయాళ కంటెంట్ సినిమాలు రావడంలేదని చాలా మంది అంటున్నారు. అలాంటి వైరెటీ కథలో రెండేళ్ళ కష్టపడ్డ సినిమాను చేస్తే ఇలా ఎందుకు జరిగింది? అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తన భార్య కూడా సినిమా చూసి బాగుందని చెప్పింది. చూసిన వారు కూడా మంచి సినిమా అంటున్నారు.
కానీ ఎందుకిలా జరిగింది అంటూ నేను రిలీజ్ కు ముందు సినిమా బాగోలేదని ప్రేక్షకులు అంటే నా చెప్పుతో నేను కొట్టుకుంటా..అని అన్నాను. ఇప్పుడు అదే జరుగుతుంది అంటూ విలపించారు. ఎంత విలపించినా సినిమా ఆడడం ఆడకపోవడం అనేది విడుదలకు కూడా తేదీ, సమయం, కాలం బట్టి వుంటుందనే చాలా సినిమాలు రుజువు చేశాయి. ఇవి ఇప్పటి తరం ఆలోచించుకోవాలని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.