జియోబుక్ పేరుతో జియో ల్యాప్‌టాప్ : స్పెసిఫికేషన్స్ లీక్??

శుక్రవారం, 12 నవంబరు 2021 (18:30 IST)
దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో అడుగుపెట్టిన తర్వాత విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన అనతి కాలంలోనే దేశంలో నంబర్ వన్‌గా అవతరించింది. ఆ తర్వాత జియోఫోన్ నెక్ట్స్ అనే స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్క‌రించింది. ఇపుడు జియోబుక్ పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
ఇందుకోసం ఓ చైనా కంపెనీ స‌హ‌కారంతో రూపుదిద్దుకుంటున్న జియోబుక్‌.. ల్యాప్‌టాప్ ఈ ఏడాది చివ‌రిక‌ల్లా మార్కెట్‌లోకి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 2జీ రామ్‌, మీడియాటెక్ ఎంటీ8788 ఎస్వోసీ ప్రాసెస‌ర్‌, ఆండ్రాయిడ్-11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో ప‌ని చేస్తుందిది. 4జీ ఎల్టీఈ మ‌ద్ద‌తుతో పని చేసే ఈ ల్యాప్‌టాప్‌లో జియో యాప్స్ అన్నీ ముంద‌స్తుగానే ఇన్‌స్టాల్ చేస్తారు.
 
ఈ ల్యాప్‌టాప్‌ను ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ప‌నిచేసే ఐటీ నిపుణుల‌కు, వివిధ కార్యాల‌యాల్లో సేవ‌లందిస్తున్న ప్రొఫెష‌న‌ల్స్‌కు ఉపయోగపడేలా రూపొందిస్తున్నారు. దాదాపు రెండు నెల‌ల క్రిత‌మే బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) స‌ర్టిఫికేష‌న్ వెబ్‌సైట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. 
 
జియో ల్యాప్‌టాప్‌లో ఉండే స్పెషిఫికేష‌న్స్‌..
మాక్ ఓఎస్ ఎక్స్‌, విండోస్‌, సెంట్ర‌ల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆఫ్ కంప్యూట‌ర్‌కు క్రాస్‌-ప్లాట్‌ఫామ్ యుటిలిటీయే గీక్‌బెంచ్‌. జియోబుక్ 1366x 768 పిక్సెల్ రిజొల్యూస‌న్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ ఎక్స్ 12 4జీ మోడెంతోపాటు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 665 ప్రాసెస‌ర్ త‌దిత‌ర స్పెసిఫికేష‌న్స్ దీని స్పెషాలిటీ. ఇది ఎన్బీ1118క్యూఎండ‌బ్ల్యూ, ఎన్బీ 1148క్యూఎండ‌బ్ల్యూ, ఎన్బీ 1112ఎంఎం వేరియంట్ల‌లో జియో బుక్ వ‌స్తోంది.
 
అలాగే, 32 జీబీ స్టోరేజీతో 2జీబీ ర్యామ్ కెపాసిటీ, 64 జీబీ స్టోరేజీతో 4జీబీ ర్యామ్ మోడ‌ల్ ల్యాప్ ట్యాప్స్ రానున్నాయి. బ్లూటూత్, డ్యుయ‌ల్ బాండ్ వై-పై, మినీ హెచ్డీఎంఐ క‌నెక్ట‌ర్ వంటి క‌నెక్టివిటీ ఆప్ష‌న్స్ ఉన్నాయి. జియో స్టోర్‌, జియోమీట్‌, జియో పేజేఎస్ వంటి జియో యాప్స్ ముంద‌స్తుగానే జియోబుక్‌లో ఇన్‌స్టాల్ చేస్తారు. 3-యాక్సిస్ ఏస్సెలెరోమీట‌ర్‌, క్వాల్‌కామ్ ఆడియో చిప్ కూడా ఇందులో ఉంటుంది. టీమ్స్‌, ఎడ్జ్‌, ఆఫీస్ వంటి మైక్రోసాఫ్ట్ యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు