రిలయన్స్ జియో ఉచితంగా 4జీ ఫీచర్ ఫోనును అందజేయనున్నట్టు ప్రటించింది. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించుకోనున్నట్టు తెలిపింది. దీంతో ఇతర మొబైల్ ఆపరేటర్లు కూడా ఇదే తరహా ఆఫర్‌కు తమ వినియోగదారులనే కాకుండా, కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ముందుకు వస్తున్నారు.
జియో ఫోన్‌లో వాట్సాప్ లాంటి యాప్స్ రావని, అందులో కేవలం జియో సిమ్ మాత్రమే పనిచేస్తుందని విమర్శించారు. కానీ తాము తీసుకురాబోయే ఫోన్‌లో యూజర్లకు అవసరమైన వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి అన్ని యాప్స్ పనిచేస్తాయన్నారు. అయితే అందులో మరి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తారా..? లేదా..? అన్న వివరాలను వెల్లడించలేదు.