మేడ్ ఇన్ ఇండియా జియో బ్రౌజర్ వచ్చేసింది.. యూసీ బ్రౌజర్‌ను బ్యాన్ చేయడంతో?

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (10:15 IST)
జియో నుంచి మరో గుడ్ న్యూస్. తాజాగా మేడ్ ఇన్ ఇండియా జియో బ్రౌజర్ వచ్చేసింది. గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఒపెరా లంటి బ్రౌజర్లకు పోటీగా జియో ప్రత్యేకమైన బ్రౌజర్ తీసుకొచ్చింది. బీటా వర్షన్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. యూజర్లు ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని జియోబ్రౌజర్ వాడుకోవచ్చు. మల్టీప్రాసెస్ క్రోమియం బ్లింక్ ఇంజిన్ ద్వారా ఈ బ్రౌజర్ పనిచేస్తుంది. 
 
మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా యాప్స్‌కు డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌తో ఇప్పటికే చైనాకు చెందిన యూసీ బ్రౌజర్‌ను బ్యాన్ చేశారు. ఇప్పుడు వీటన్నింటికీ పోటీనిస్తూ జియో బ్రౌజర్ వచ్చేసింది.
 
జియో బ్రౌజర్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. సెక్యూర్ పిన్‌తో ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ ఉంటుంది. ప్రైవేట్ మోడ్‌లో బ్రౌజ్ చేసిన కంటెంట్‌ను పిన్ సాయంతో బుక్‌మార్క్ చేయొచ్చు. అడ్వాన్స్‌డ్ డౌన్‌లోడ్ మేనేజర్ ఫీచర్ ఉంటుంది. దీని ద్వారా మీకు కావాల్సిన ఫైల్స్ డౌన్‌లోడ్ చేయొచ్చు. 
 
జియో బ్రౌజర్ ద్వారా గతంలో కన్నా వేగంగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయొచ్చు. ఇది లైట్ వెయిట్ వెబ్ బ్రౌజర్. ఫైల్ సైజ్ 27ఎంబీ మాత్రమే. ఇప్పటికే కోటికి పైగా డౌన్‌లోడ్స్ ఉండటం విశేషం. లేటెస్ట్ న్యూస్, వీడియోస్ యాక్సెస్ చేయొచ్చు. లైవ్ క్రికెట్ స్కోర్ అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు