ప్రత్యేకించి వ్యాధికారిక క్రిములను నాశనం చేసేందుకు అల్ట్రా జెర్మిసిడాల్ అనే స్మార్ట్ ఫ్యాన్‌ను డిజైన్ చేసింది మోడ్రాన్ ఫామ్స్ అనే సంస్థ. వాస్తవానికి సీలింగ్ ఫ్యాన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం ఈ స్మార్ట్‌ఫోన్ కనిపెట్టలేదంటున్నారు మోడ్రాన్ ఫామ్స్, డబ్ల్యూఏసీ సంస్థ కో-సీఈఓ డార్క్ వాల్డ్ పేర్కొన్నారు.
కానీ, ఇప్పుడు సీలింగ్ మార్కెట్లో కూడా కొత్త రకం టెక్నాలజీ కలిగిన ఈ స్మార్ట్ ఫ్యాన్ వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ పేటెంట్ పెండింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. దాంతో సీలింగ్ ఫ్యాన్ మాదిరిగా తిరుగుతుంది. తద్వారా ఇంట్లోని గదిలో అన్నివైపులా గాలి వస్తుంది. అప్పుడు గాలిలో కంటికి కనిపించని వ్యాధికారక క్రిములను నివారించగలదని కంపెనీ చెబుతోంది.